వావ్ వాట్ ఏ లాజిక్.. పాము కోసం అనుకుంటే చివరికి..

by  |
వావ్ వాట్ ఏ లాజిక్.. పాము కోసం అనుకుంటే చివరికి..
X

దిశ, వెబ్ డెస్క్: వ్యక్తి చేసిన అనాలోచిత పనికి ఏకంగా నివాసమే కాలి బూడిదైపోయింది. అమెరికాలోని మైంట్ గోమేరి కౌంటీలో కోట్ల విలువ గల ఇల్లు కాలిబూడిద అయింది. ఇంట్లోకి పాము దూరితో కర్రతో కొట్టి చంపేస్తాం. సిటీలో అయితే ఏ పాములు పట్టే వాళ్లనో పిలిపించి దాన్ని పట్టుకునేలా చేస్తాం. అయితే అమెరికా లో ఓ వ్యక్తి విచిత్రంగా ఆలోచించాడు. ఇంట్లోకి దూరిన పామును బయటకు రప్పించాలంటే పొగ పెట్టాలి కదా అనుకున్నాడు. అందుకే అది ఏ కన్నం లో దూరిందో తెలియక వెతుకుతుండగా, ఒక కర్రముక్క దగ్గర రంద్రం కనిపించింది.

వెంటనే దాని దగ్గర పొగ వేశాడు. పాము బయటకు రావడం మాట అటుంచితే మెల్లిగా ఇల్లు కాలడం మొదలైంది. లబోదిబో మంటూ ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. అయితే వాళ్లు వచ్చేసరికే ఇల్లు మొత్తం బూడిద అయింది. మనోడి వింత ఆలోచన విన్న ఫైర్ సిబ్బంది ఈ ఇంటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇక్కడ అదృష్టం ఏంటంటే ఎవరికీ ఏ చిన్న గాయం కూడా కాలేదు. కానీ భారీ ఆస్తి నష్టం మాత్రం జరిగింది.


Next Story

Most Viewed