తాగుడు మానాలన్నందుకు..

by Chintha Aamani |   (  Updated:2020-11-17 11:43:11  IST  )

<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: మద్యానికి బానిసైన వ్యక్తి భార్యను హత్య చేశాడు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కుర్ర పేటలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే&#8230;. ఉప్పుల సాయిలు, పెంటమ్మలు భార్య భర్తలు. చాలా కాలంగా సాయిలు తాగుడుకు బానిసయ్యాడు. భార్యతో తరచూ గొడవ పడేవాడు. ఇదే క్రమంలో తాగుడు మానుకోవాలని భార్య హెచ్చరించడంతో సాయిలు కోపోద్రిక్తుడు అయ్యాడు. ఆమెను సాయిలు తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె మృతి చెందింది. పెంటమ్మ తల్లిదండ్రులు [&hellip;]</p>

తాగుడు మానాలన్నందుకు..
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: మద్యానికి బానిసైన వ్యక్తి భార్యను హత్య చేశాడు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కుర్ర పేటలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే…. ఉప్పుల సాయిలు, పెంటమ్మలు భార్య భర్తలు. చాలా కాలంగా సాయిలు తాగుడుకు బానిసయ్యాడు. భార్యతో తరచూ గొడవ పడేవాడు.

ఇదే క్రమంలో తాగుడు మానుకోవాలని భార్య హెచ్చరించడంతో సాయిలు కోపోద్రిక్తుడు అయ్యాడు. ఆమెను సాయిలు తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె మృతి చెందింది. పెంటమ్మ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిర్మల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story