- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బావిలో దూకి ప్రేమజంట ఆత్మహత్య
<p>దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ అర్బన్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఖిలా వరంగల్ మండలం నక్కల పల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. నక్కలపల్లి గ్రామానికి చెందిన సాయికుమార్ (22) సిద్దిపేటకు చెందిన అశ్విని (19) కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని ఇదే విషయాన్ని పెద్దలకు తెలిపారు. ఈ విషయంలో పెద్దల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయింది. దీంతో వారు ఆత్మహత్యకు […]</p>

దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ అర్బన్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఖిలా వరంగల్ మండలం నక్కల పల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. నక్కలపల్లి గ్రామానికి చెందిన సాయికుమార్ (22) సిద్దిపేటకు చెందిన అశ్విని (19) కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని ఇదే విషయాన్ని పెద్దలకు తెలిపారు.
ఈ విషయంలో పెద్దల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయింది. దీంతో వారు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. నక్కలపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్ద సాయికుమార్ బైక్‌తో పాటు పక్కనే తాళిబొట్టు, రెండు సెల్‌ఫోన్లు ఇతర వస్తువులు శుక్రవారం మధ్యాహ్నం కనిపించాయి. దీంతో ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు స్థానికులు అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో సాయికుమార్, అశ్వినీల మృతదేహాలను వెలికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






