- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశ్వసనీయతకు మారుపేరు కేసీఆర్
<p>దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తుక్కాపూర్ నుంచి తొగుట వరకు నాలుగు కిలోమీటర్లు బైక్‌లతో మంగళవారం ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొని మాట్లాడుతూ… బీజేపీ, కాంగ్రెస్ వాళ్లది కేవలం వాపు మాత్రమే అని ఎద్దేవా చేశారు. దుబ్బాకలో నిజమైన బలం టీఆర్ఎస్‌దే అన్నారు. వీశ్వసనీయతకు మారుపేరు కేసీఆర్ అని వెల్లడించారు. సాధ్యం కాదనుకున్న తెలంగాణను సాధ్యం చేసి తీసుకొచ్చింది కేసీఆర్ […]</p>

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తుక్కాపూర్ నుంచి తొగుట వరకు నాలుగు కిలోమీటర్లు బైక్‌లతో మంగళవారం ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొని మాట్లాడుతూ… బీజేపీ, కాంగ్రెస్ వాళ్లది కేవలం వాపు మాత్రమే అని ఎద్దేవా చేశారు. దుబ్బాకలో నిజమైన బలం టీఆర్ఎస్‌దే అన్నారు. వీశ్వసనీయతకు మారుపేరు కేసీఆర్ అని వెల్లడించారు. సాధ్యం కాదనుకున్న తెలంగాణను సాధ్యం చేసి తీసుకొచ్చింది కేసీఆర్ అని గుర్తు చేశారు.
దేశంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్ర తెలంగాణ అని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత నీళ్లు తెచ్చాం, నిధులు తెచ్చామని అన్నారు. అధికారంలోకి వస్తే ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని దేశాన్ని మోడీ ప్రభుత్వం ఆగం చేసిందని వెల్లడించారు. తెలంగాణలో 1,24,999 ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. మోడీ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించకపోగా… డీమానిటైజేషన్ మూలంగా ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయని విమర్శించారు. నిజామామాద్‌లో గెలిస్తే… పసుపు బోర్డు తీసుకొస్తామని రైతులను మోసం చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా దుబ్బాకలో కూడా బీజేపీ గెలిస్తే రైతులు మోస పోవడం ఖాయం అని అన్నారు.






