కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదం

by  |
కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదం
X

దిశ, మధిర : ఖమ్మం జిల్లా మధిర మండలంలోని కాటన్‌ మిల్లులో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మాటూర్‌ గ్రామంలోని మంజిత్‌ కాటన్‌ మిల్లులో సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగి దావానంలా వ్యాపించాయి. పత్తి బేళ్లు, యంత్రాలకు మంటలు అంటుకోవడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది.

విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. మంటలు అదుపులోకి వస్తే ఆస్తినష్టంపై స్పష్టమైన అంచనా వచ్చే అవకాశముంది.



Next Story

Most Viewed