భార్యతో ఎంజాయ్ చేయడానికి కొడుకును అమ్మేసిన తండ్రి

118

దిశ, వెబ్ డెస్క్:  కొన్నిసార్లు మనం వింటున్న వార్తలు నిజమేనా అనిపిస్తుంది. ప్రపంచంలో ఇలాంటివి జరుగుతాయా? అని అనిపిస్తుంటుంది. పిల్లల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన తల్లిదండ్రులను చూసి ఉంటాం.. వారి చదువుల కోసం ఆస్తిపాస్తులను అమ్ముకున్నవారి గురుంచి విని ఉంటాం.. ఇంకా పిల్లల భవిష్యత్తు కోసం తమ శరీర భాగాలను సైతం అమ్మకానికి పెట్టిన అమ్మానాన్నల గురుంచి గొప్పగా చెప్పుకొంటాం. ఇక కొన్నిసార్లు ఇంట్లో అప్పులు తీర్చలేక, బిడ్డల్ని పెంచలేక శిశువును అమ్ముకున్న తండ్రులు గురించి కూడా విని ఉంటాం. కానీ భార్య తో హనీమూన్ కి వెళ్లడం కోసం రెండేళ్ల కుమారుడ్ని అమ్మనుకున్నాడు ఒక కసాయి తండ్రి. ఈ దారుణ ఘటన చైనాలో వెలుగు చూసింది.

చైనా లోని  జెజియాంగ్‌కు చెందిన ఒక వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహమయ్యింది. వీరికి ఒక పాప, బాబు. అయితే బిడ్డలు పుట్టాకా కుటుంబ విభేదాలతో భార్యాభర్తలిద్దరూ విడిపోయారు. కోర్టు ఆదేశాల మేరకు పాప ను తల్లి, బాబును తండ్రి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగం చేస్తున్న అతనికి బాబును పెంచడం కష్టమయ్యింది. దీంతో బాబును అతని అమ్మానాన్నల వద్ద వదిలి మరో పెళ్లి చేసుకున్నాడు. అయితే బాబును పెంచడానికి రెండో భార్య ససేమిరా అని చెప్పింది. దీంతో రెండేళ్ల చిన్నారిని కసాయి తండ్రి  అమ్మకానికి పెట్టాడు. బిడ్డతల్లి బిడ్డను చూడాలనుటుందని పేరెంట్స్ కి చెప్పి చిన్నారిని తీసుకొచ్చాడు. ఏ మాత్రం జాలీ, దయ లేకుండా రెండు సంవత్సరాల చిన్నారిని 1,58,000 యువాన్లు(సుమారు 18 లక్షల రూపాయలు)కు అమ్మేశాడు.

అనంతరం ఆ డబ్బుతో రెండో భార్యతో హనీమూన్ కి చెక్కేశాడు. వారం రోజుల తర్వాత బిడ్డ కోసం బిడ్డతల్లి ఆరా తీసింది. దీంతో విషయం బయటపడింది. వెంటనే మొదటి భార్య, భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.  దంపతులు వచ్చే వరకు ఎదురు చూసిన పోలీసులు ఆ తర్వాత వారిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..