- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమరావతినే కొనసాగించాలని.. టవర్ ఎక్కిన రైతు
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న నాటి నుంచి రాష్ట్రంలో నిరసనలు మిన్నంటాయి. తాజాగా మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర తెలిపారు. సీఆర్డీఏ చట్టం- 2014 రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులకు బిశ్వభూషణ్ హరిచందన్ లైన్ క్లియర్ చేశారు. దీంతో మళ్లీ నిరసనలు మొదలయ్యాయి. సోమవారం నేలపాడులోని రైతు పూర్ణ చంద్రరావు టవర్ దగ్గర క్రేన్‌పై ఎక్కి నిరసనకుదిగాడు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు సోదరుడు […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న నాటి నుంచి రాష్ట్రంలో నిరసనలు మిన్నంటాయి. తాజాగా మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర తెలిపారు. సీఆర్డీఏ చట్టం- 2014 రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులకు బిశ్వభూషణ్ హరిచందన్ లైన్ క్లియర్ చేశారు. దీంతో మళ్లీ నిరసనలు మొదలయ్యాయి. సోమవారం నేలపాడులోని రైతు పూర్ణ చంద్రరావు టవర్ దగ్గర క్రేన్‌పై ఎక్కి నిరసనకుదిగాడు.
ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు సోదరుడు పులి చిన్న ఓ మీడియాతో మాట్లాడుతూ… అమరావతి రాజధాని అవుతుందని ఓ ఎంపీ వెంట తిరిగి చాలా డబ్బులు ఖర్చుపెట్టి, భూములిచ్చి అప్పులపాలయ్యాడని..ఇప్పుడు మూడు రాజధానుల ప్రకటన రాగానే తన సోదరుడు మనస్తాపం చెంది క్రేన్ ఎక్కి నిరసనకు దిగాడన్నారు. పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం అన్ని విధాల రైతులను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు న్యాయం జరగాలని, ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తేనే టవర్ దిగుతానని, లేకుంటే కిందికి దూకుతానని స్పష్టం చేశాడు.






