ICUలో పసికందు.. తల్లడిల్లుతున్న తల్లి హృదయం

by  |
child suffering chest infection
X

దిశ, బాన్సువాడ: ‘‘నవ మాసాలు మోసి, పురిటి నొప్పులు భరించి, ఆ తల్లి బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ భూమి మీదకు రాగానే అప్పటి వరకు భరించిన బాధను, కష్టాన్ని బిడ్డను తనివితీరా చూడగానే మర్చిపోయింది. ఇంతలో డాక్టర్ వచ్చి తల్లి గుండె పగిలే వార్త చెప్పాడు.’’ ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లావణ్య కామెర్ల వ్యాధితో బాధపడుతోంది. దీంతో ఆమె బాన్సువాడ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటోంది. ఈ క్రమంలో ఆమెకు పుట్టిన ఐదురోజుల పాప సైతం అనారోగ్యంతో బాధపడుతున్నట్లు గమనించిన వైద్యులు పరీక్షించారు.

పాప ఊపిరి తీసుకునే వేగం పెరిగిందని, ఛాతి ఇన్ఫెక్షన్‌కు సంబంధించిన వ్యాధితో బాధపడుతోందని తెలిపారు. ఆ వ్యాధికి సంబంధించిన సదుపాయాలు బాన్సువాడ లేకపోవడంతో పాప పరిస్థితి సీరియస్‌గా మారిందని వైద్యులు చెప్పడంతో హుటాహుటిన నిజామాబాద్ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, గత రెండు వారాలుగా ఆసుపత్రుల చుట్టూ తిరిగిన తల్లి లావణ్య అలసిపోయింది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం, అందులో ఒంటరి మహిళ కావడంతో ఆసుపత్రి ఖర్చులు భరించలేక తల్లడిల్లుతోంది. సాయం చేయాలని దాతలను వేడుకుంటోంది. Cell: 8008199884 సంప్రదించి సహాయం చేయాలని కోరుతున్నారు.


Next Story