బొడిగె శోభపై ఏపీలో కేసు నమోదు

by srinivas |   ( Updated:2021-04-07 02:09:07.0  )
బొడిగె శోభపై ఏపీలో కేసు నమోదు
X

దిశ, కరీంనగర్ సిటీ : ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి అలజడి సృష్టించిన, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మహిళా నాయకురాలు బొడిగె శోభపై పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా కేసు నమోదు అయింది. ప్రజా ఉద్యమంలో పాల్గొన్న ఆమె తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పట్ల జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేసిందని, ఏపీ టీఆర్ఎస్ అధ్యక్షుడు కొణిజేటి ఆదినారాయణ, విజయవాడ సీపీ శ్రీనివాసులుకు మంగళవారం రాత్రి ఫిర్యాదు చేసినట్లు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.

Advertisement

Next Story