- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రొటవేటర్‌లో పడి బాలుడు మృతి
<p>దిశ ములుగు : ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ములుగు మండలంలోని రైమ్ నగర్ తండాలో ట్రాక్టర్ రొటవేటర్‌లో పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఘటన వివరాల్లోకి వెళితే… రైమ్ నగర్ తండాకు చెందిన గుగులోతు సబ్కకు ట్రాక్టర్ ఉంది. సబ్క ఇంటి ముందు ఉండే గుగులోతు చిన్నలచులు అలియాస్ గోరె.. తన పొలం దున్నేందుకు ట్రాక్టర్ తీసుకొని వెళ్లాడు. పొలానికి వెళుతుండగా ట్రాక్టర్ పై సబ్కా కుమారుడు రాజేందర్(5)ను గోరె వెంట తీసుకు […]</p>

దిశ ములుగు : ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ములుగు మండలంలోని రైమ్ నగర్ తండాలో ట్రాక్టర్ రొటవేటర్‌లో పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఘటన వివరాల్లోకి వెళితే… రైమ్ నగర్ తండాకు చెందిన గుగులోతు సబ్కకు ట్రాక్టర్ ఉంది. సబ్క ఇంటి ముందు ఉండే గుగులోతు చిన్నలచులు అలియాస్ గోరె.. తన పొలం దున్నేందుకు ట్రాక్టర్ తీసుకొని వెళ్లాడు. పొలానికి వెళుతుండగా ట్రాక్టర్ పై సబ్కా కుమారుడు రాజేందర్(5)ను గోరె వెంట తీసుకు వెళ్లాడు.
పొలం దున్నుతుండగా బాలుడు జారి రోటవేటర్‌లో పడిపోయారు. దీంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో బాలుడు మృతిచెందాడు. కాగా బాలుడి మృత దేహాన్ని గోరే గుట్టు చప్పుడు కాకుండా పక్కనే ఉన్న నీరు లేని బావిలో పడేశాడు. విషయం తెలుసుకున్న తల్లి దండ్రులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని బావి నుంచి వెలికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






