- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లైవ్‌లో బాలుడు ఏం చేశాడో తెలుసా?
<p>దిశ, వెబ్‌డెస్క్: బీచ్‌లో న్యూస్ కవర్ చేస్తున్న రిపోర్టర్‌కి ఓ బాలుడు షాక్ ఇచ్చాడు. బీచ్, అక్కడి ప్రత్యేకతను తెలుపుతున్న సమయంలో వెనకాలే ఉన్న బాలుడు ఏకంగా వీడియోలో కనబడేలా అల్లరి చేష్టలు చేశాడు. పేరు గాంచిన బీబీసీ న్యూస్ ఛానెల్ ప్రజెంటర్‌కు ఈ విధమైన పరిణామం ఎదురైంది. బీబీసీకి చెందిన జెన్ బార్త్రామ్ అనే న్యూస్ రిపోర్టర్ యూకేలోని సౌత్ షీల్డ్స్ నుంచి లైవ్ ఇస్తోంది. ఇదే సమయంలో అక్కడే ఉన్న బాలుడు కెమెరాలో కనిపించేలా […]</p>

దిశ, వెబ్‌డెస్క్: బీచ్‌లో న్యూస్ కవర్ చేస్తున్న రిపోర్టర్‌కి ఓ బాలుడు షాక్ ఇచ్చాడు. బీచ్, అక్కడి ప్రత్యేకతను తెలుపుతున్న సమయంలో వెనకాలే ఉన్న బాలుడు ఏకంగా వీడియోలో కనబడేలా అల్లరి చేష్టలు చేశాడు. పేరు గాంచిన బీబీసీ న్యూస్ ఛానెల్ ప్రజెంటర్‌కు ఈ విధమైన పరిణామం ఎదురైంది.
బీబీసీకి చెందిన జెన్ బార్త్రామ్ అనే న్యూస్ రిపోర్టర్ యూకేలోని సౌత్ షీల్డ్స్ నుంచి లైవ్ ఇస్తోంది. ఇదే సమయంలో అక్కడే ఉన్న బాలుడు కెమెరాలో కనిపించేలా చిందులు వేశాడు. తన అల్లరి చేష్టలు ఆ ప్రోగ్రాంలో మొత్తం రికార్డు అయ్యాయి. ఇది గమనించిన రిపోర్టర్ ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ.. ఆ బాలుడు చేసిన చిందులకు తగ్గట్టుగా మ్యూజిక్ పెట్టి షేర్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
I’ve given this forecast what it deserved. Sound on. pic.twitter.com/3hBCJLvjQo
— Jen Bartram (@JenBartram) July 31, 2020






