దసరా స్పెషల్ : 73 ఏళ్ల వ్యక్తితో ఆ పనికి ఓకే చెప్పిన 26 ఏళ్ల మహిళ

94
Late marriage

దిశ, ముధోల్ : తనువులు కలవాలి గానీ వయసుతో ఏం సంబంధం అంటారు పెద్దలు. నేటి యువత కూడా అదే ఆలోచిస్తోంది. కాబోయే భర్త ఆస్తిపరుడు, నెల నెల ఆదాయం ఉంటే చాలునుకుంటున్నారు. వయసులో వ్యత్యాసం ఉన్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. సరిగ్గా ఇలాంటి పెళ్లే జరిగింది నిర్మల్ జిల్లాలో.. అయితే వరుడికి, వధువు వయసుకు మధ్య ఏకంగా 47 ఏళ్ల వ్యత్యాసం ఉండడం అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది.

ముధోల్ మండలం చింతకుంట తండాకు చెందిన రాథోడ్ కిషన్ (73) ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసి రిటైర్డ్ అయ్యాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. అందరికి పెళ్లై వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. కిషన్ భార్య గతంలో అనారోగ్యంతో మృతి చెందగా అప్పటి నుండి ఆయన ఒంటరిగానే ఉంటున్నాడు. కుభీర్ మండలం రంజని తండాకు చెందిన సునీత (26) భర్త ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఈమెకు ఒక కూతురు ఉంది. కూలి పని చేస్తూ పాపను పోషించుకుంటుంది. బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో కిషన్, సునీత పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఇద్దరి మనుసులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇద్దరు వారి ఇళ్లలో పెళ్లి విషయాన్ని చెప్పారు. అయితే ఇద్దరికి ఓ తోడు కావల్సి ఉందని గ్రహించిన ఇరు కుటుంబాల సభ్యులు వీరిద్దరి పెళ్లికి ఓకే చెప్పేశారు. ఇంకేముంది పెళ్లి పనులు చకచకా చేసుకున్న బంధువులు మేళా తాళాల మధ్య బుధవారం నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగాం గ్రామంలోని సాయిబాబా ఆలయంలో వైభవంగా వివాహాన్ని జరిపించారు. ఈ పెళ్లి తంతుకు ఇరు కుటుంబాల బంధుమిత్రులు, వరుడి మనవళ్లు, మనమరాళ్లు, గ్రామస్తులు హాజరై ఆశీర్వదించారు. అయితే పెళ్లిని చూసిన వాళ్లలో కొందరు అతడికి 73, ఆమె 26.. అంటే ఇద్దరి మధ్య 47 ఏళ్ల వయసు గ్యాప్ ఉందని.. ముసలోడికి దసరా పండుగే అని కొందరు అంటుంటే.. ఒంటరి జీవితానికి మంచి తోడు దొరికిందని మరి కొందరు అంటున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..