- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీ వర్షాలకు విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకుపోయిన 1000 మంది
దేశంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి.

దిశ,వెబ్ డెస్క్:ఓ వైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం భారీ వర్షాలు (heavy rain) కురుస్తున్నాయి. సిక్కింలో (Sikkim) వర్ష బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు (landslide) విరిగిపడ్డాయి. 1000 మందికిపైగా పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు (tourists stranded). దీంతో అధికారులు కీలక రహదారుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మున్షితాంగ్ ప్రాంతంలోని లాచెన్-చుంగ్తాంగ్ రోడ్డు, లెమా/బాబ్ వద్ద గురువారం భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. గాంగ్టక్ నుంచి చుంగ్తాంగ్ వరకూ సుమారు 100 కి.మీ. ప్రాంతంలో నిరంతర వర్షాలు కురుస్తున్నందున పరిస్థితి మరింత దిగజారింది. కఠినమైన వాతావరణ పరిస్థితులు, కొండచరియలు విరిగిపడటం వల్ల ఆయా ప్రాంతాలకు సందర్శకులకు అనుమతిని రద్దు చేశారు. ఈ పరిస్థితి కారణంగా వెయ్యి మంది పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పరిస్థితులు మెరుగుపడే వరకు సందర్శకులు, స్థానికులు నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.






