- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Weather Alert :చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు.. ఐఎండీ కీలక ప్రకటన
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.

దిశ,వెబ్డెస్క్: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. నైరుతి రుతుపవనాలు(Southwest Monsoon) మరో పది రోజుల్లో కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్ష ప్రభావం పై ఐఎండీ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఈ తరుణంలో తాజాగా IMD కీలక ప్రకటన చేసింది. నైరుతి రుతుపవనాలు మరో పది రోజుల్లో కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ(Indian Meteorological Department) వెల్లడించింది.
ఈ నెల(మే) 22న అండమాన్(Andaman)ను, 26న శ్రీలంక(Sri Lanka)ను తాకవచ్చని ముందుగా ఐఎండీ అంచనా వేసింది. కానీ.. పది రోజుల ముందుగానే శ్రీలంకలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ప్రజెంట్ శ్రీలంక అండమాన్లలో విస్తరించినట్లు తెలిపింది. ఈ క్రమంలో మే 27వ తేదీ నాటికి కేరళను(Kerala Monsoon arrival Weather) తాకే ఛాన్స్ ఉన్నట్లు అంచనా. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రుతుపవనాలు మరో నాలుగైదు రోజుల్లో వేగంగా కదులుతాయని తెలిపింది.
దీని ప్రభావంతో రాగల మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ(Weather) మార్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ(Meteorological Department) అధికారులు తెలిపారు.






