- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి రెడ్ అలర్ట్.. కొద్దిసేపట్లో ఆ నాలుగు జిల్లాల్లో అతిభారీ వర్షాలు
నిన్నటి నుండి తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : నిన్నటి నుండి తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కొన్ని చోట్ల చెరువు కట్టలు తెగి, పొలాలు కొట్టుకుపోగా... అనేక గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. గత రాత్రి నుంచి ఒక్క కామారెడ్డిలో 49 సెంటీమీటర్లకు పైగా వర్షం పడింది. రోడ్లు, రైల్వే ట్రాకులు కొట్టుకు పోయాయి. అయితే ఈ భారీ వర్షాలు, వరదలు కొనసాగుతుండగానే... వాతావరణశాఖ మరో షాకింగ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో మరో 3 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నట్టు హెచ్చరించింది.
దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని, వాగులు, నదులు దాటే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు. వరద ముప్పు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు చర్యలు చేపట్టారు.






