Hyderabad Rains : హైదరాబాద్ లో భారీ వర్షం

by Muthe.Rajitha |

హైదరాబాద్(Hyerabad Rains) లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.

Hyderabad Rains : హైదరాబాద్ లో భారీ వర్షం
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyerabad Rains) లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కూకట్ పల్లి, మియాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, అమీర్ పేట్, సనత్ నగర్, బోరబండ, కొంపల్లి, సూరారం, జీడిమెట్ల, గచ్చిబౌలి, టోలిచౌకీ, షేక్ పేట్, అత్తాపూర్, ఖైరతాబాద్, అబిడ్స్, మెహిదీపట్నం, నాంపల్లిలో ఉరుములు(Thunderstroms), మెరుపులు, భారీ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల వడగళ్లు(Hailstroms) కూడా పడ్డాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినట్టు తెలుస్తోంది. కాగా మరో రెండు గంటల్లో మెదక్, మేడ్చల్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణకేంద్రం తెలిపింది.

Next Story