- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. గంటల వ్యవధిలోనే 35 వేల మెరుపులు
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ (AP)లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ప్రత్యేకించి కృష్ణా, గోదావరి, విజయవాడ, కడప, నంద్యాల, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వర్షాలు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడి ఉండటం తో ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విజయవాడలో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. అలాగే తెలంగాణ (Telangana)లోని ఖమ్మం, ములుగు, మహబూబాబాద్ జిల్లాలో కూడా వర్షాలు దంచికొట్టడం తో పంటకు నష్టం కలిగించాయి. ఇదిలా ఉంటే వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది.
ఈ వర్షాలు ఈ నెల 7 వరకు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది అలాగే ఏపీ తెలంగాణ మీదుగా ఏర్పడిన ద్రోణి ప్రభావంతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా ఈ రోజు ఉదయం నుంచి ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణ, ఎన్టీఆర్, అనకాపల్లి, అల్లూరి జిల్లాలో భారీ వర్షం కురవగా.. ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు 35 వేలకు పైగా మెరుపులు సంభవించినట్లు వైజాగ్ వెదర్ మ్యాచ్ వెల్లడించారు. ఇదే వాతావరణం ఈ రోజు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అలాగే సాయంత్రం వరకు కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు అలర్ట్ జారీ చేశారు.






