ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్.. అధికారుల రెడ్ అలర్ట్స్

by Muthe.Rajitha |

ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్.. అధికారుల రెడ్ అలర్ట్స్
X

దిశ, వెబ్ డెస్క్ : అతి భారీ వర్షాల(Massiv Rains) నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్(Flash Floods) వస్తాయని భారత వాతావరణశాఖ(IMD) హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో యానాం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాలు అధికంగా ఉన్నాయని పేర్కొంది. దీంతో అధికారులు అప్రమత్తమై.. ఆయా ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రంగంలోకి దిగారు. ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

అదేవిధంగా కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలు, లంక గ్రామాల ముంపు ప్రాంతాలకు రెడ్ అలర్ట్స్ జారీ చేసింది. నదిలో ఎవరూ ఈతకు వెళ్లకూడదని, చేపల వేటకు వెళ్లకూడదని తెలిపింది. వీలైతే ఇళ్ళు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచనలు చేసింది. ప్రకాశం బ్యారేజిలోకి 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో 1వ నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేసారు అధికారులు.

Next Story