- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Massive Rains : అతి భారీ వర్షాలు.. కేరళలో రెడ్ అలర్ట్
ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు(Monsoon) ముందుగానే తీరాన్ని తాకిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు(Monsoon) ముందుగానే తీరాన్ని తాకిన విషయం తెలిసిందే. అలాగే అరేబియా సముద్రం, కొంకణ్ తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం(LPA)తో రానున్న వారం రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు(Massive Rains) కురవనున్నాయి. ముఖ్యంగా కేరళలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్(Red Alert in Kerala) ప్రకటించారు. నదీ తీర ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. అలాగే కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవాలకు మే 25 నుండి జూన్ 1, 2025 వరకు ప్రయాణాలు చేయవద్దని IMD హెచ్చరికలు జారీ చేసింది.
పశ్చిమ కనుమల్లోని వయనాడ్, మున్నార్, ఇడుక్కి, కొడగు, చిక్మగలూర్, ఉత్తర కన్నడ, ముంబై, పూణే, కొంకణ్, గోవా తీర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే(Land Slides) అవకాశం ఉందని, ఆకస్మిక వరదలు సంభవించవచ్చని తెలిపింది. ముందస్తు రుతుపవనాలు, సైక్లోనిక్ యాక్టివిటీ, వాతావరణ మార్పుల వల్ల ఈ ఏడాది వర్షాల తీవ్రత భారీగా పెరగనుందని పేర్కొంది. కాగా 2024లో వయనాడ్‌లో 572 మి.మీ. అతి భారీ వర్షంతో కొండచరియలు విరిగిపడి 200 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్న మరో 3 రోజులపాటు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలతోపాటు భారీ వర్షాలు కురవనున్నాయి.






