- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Weather News : ఏపీకి తుఫాను హెచ్చరికలు!
వాయువ్య బంగాళాఖాతం(Northwest Bay of Bengal)లో ఒడిశా తీరం దగ్గర మే 27న ఒక అల్పపీడనం(LPA) ఏర్పడింది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీకి తుఫాను గండం పొంచి ఉందా అంటే అవును అనే తెలుస్తోంది. నేడు అధికారులు విడుదల చేసిన ప్రకటనతో ఏపీ సైక్లోన్ ముప్పు ఎదుర్కోబోతున్నట్టు సమాచారం. అయితే వాయువ్య బంగాళాఖాతం(Northwest Bay of Bengal)లో ఒడిశా తీరం దగ్గర మే 27న ఒక అల్పపీడనం(LPA) ఏర్పడింది. ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ, రాబోయే 48 గంటల్లో, అంటే మే 29 నాటికి, తీవ్రమైన అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్(AP), ఒడిశా(Odisha), తెలంగాణ(Telangana), చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అల్పపీడనం ఉత్తర దిశగా పయనించి బంగ్లాదేశ్, మయన్మార్ వైపు వెళ్లవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ కారణంగా ఏపీలో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల పిడుగుల(Thunders)తో కూడిన వర్షాలు పడవచ్చని అధికారులు హెచ్చరించారు. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు, వరదలు, పిడుగుల నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 నంబర్లకు కాల్ చేయాలని పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకపోవడమే ఉత్తమం అని తెలియజేసింది.






