- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. ఎంటరైన నైరుతి రుతుపవనాలు
వేసవి తాపంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ (Indian Meteorological Department) చల్లని కబురు చెప్పింది.

దిశ, వెబ్డెస్క్: వేసవి తాపంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ (Indian Meteorological Department) చల్లని కబురు చెప్పింది. కేరళ (Kerala) తీరాన్ని తాకిన నైరుతి రుతు పవనాలు క్రమంగా విస్తరిస్తూ పశ్చిమ మధ్య, తూర్పు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) రాష్ట్రాలకు ఎంటరయ్యాయని అధికారులు తెలిపారు. ఈ రుతుపవనాలు ఉత్తర బంగాళాఖాతానికి చేరుకుని మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ ప్రాంతాలపై ప్రభావం చూపుతున్నాయి. అదేవిధంగా ఉత్తర తెలంగాణ (North Telangana)పై ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో సోమవారం నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ (IMD) తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.






