- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ప్రజలకు BIG అలర్ట్.. వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక
by Gantepaka Srikanth |
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) తెలిపింది.

X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rain) కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి హెచ్చరించింది. ఉమ్మడి మెదక్, వరంగల్, మహబూబాబాద్, హైదరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Next Story






