బిగ్ అలర్ట్.. మరోసారి భారీ నుంచి అతిభారీ వర్షాలు

by Muthe.Rajitha |

గత మూడు రోజుల నుంచి రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.

బిగ్ అలర్ట్.. మరోసారి భారీ నుంచి అతిభారీ వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్ : గత మూడు రోజుల నుంచి రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఉత్తర తెలంగాణ జిల్లాలైన కామారెడ్డి, మెదక్, పెద్దపల్లిలో భారీ వర్షాలు కురిసి జనజీవనం అస్తవ్యస్తం కాగా.. మరోసారి ఆయా జిల్లాలకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతారవరణ కేంద్రం హెచ్చరించింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, హన్మకొండ, వరంగల్, జనగామ, సిద్ధిపేట, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్టు HMD హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఆయా జిల్లాల అధికారులు అప్రమత్తం అయ్యారు.

Next Story