Union Budget 2025: నిర్మలమ్మకు కితాబిచ్చిన ప్రధాని మోడీ

by Yella Dhawani Reddy |

కేంద్రంలో NDA కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. పార్లమెంటులో శనివారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) పూర్తి స్థాయి బడ్జెట్‌ను (Union Budget 2025) ప్రవేశపెట్టారు.

Union Budget 2025: నిర్మలమ్మకు కితాబిచ్చిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్రంలో NDA కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. పార్లమెంటులో శనివారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) పూర్తి స్థాయి బడ్జెట్‌ను (Union Budget 2025) ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ప్రసంగం అనంతరం ప్రధాని మోడీ (PM Modi) నిర్మలమ్మను ప్రశంసించినట్లు తెలుస్తుంది. బడ్జెట్‌ ప్రసంగం అనంతరం ప్రధాని మోడీ నిర్మలా సీతారామన్ కూర్చున్న ప్రదేశానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 'బడ్జెట్‌ చాలా బాగుంది. అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తున్నారు' అని మోదీ ఆమెతో పేర్కొన్నట్లు తెలుస్తుంది.

Next Story