వైద్యం వికటించి మహిళ మృతి

by Taduka Kalyani |

వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాస్పిటల్ లో బుధవారం చోటు చేసుకుంది

వైద్యం వికటించి మహిళ మృతి
X

దిశ, నాగర్ కర్నూల్ :- వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాస్పిటల్ లో బుధవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం...నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామానికి చెందిన వనజ (32) జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి నర్సింహోమ్ కు పురిటి నొప్పులతో ఆదివారం వెళ్ళింది. స్కానింగ్ తీసి పరీక్షించారు. సర్జరీ చేయడంతో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. సర్జరీ తర్వాత బాలింతకు ఇన్ఫెక్షన్ కావడంతో నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు,గిరిజన సంఘాలు రోడ్డుపై బైఠాయించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్ది చెప్పి ఆందోళన ను విరమింప చేశారు.

Next Story