- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీర్యకణాల జీవిత కాలమెంత? బయటి వాతావరణంలో ఎంత సమయం సజీవంగా ఉంటాయి?
వీర్య స్ఖలనం తర్వాత అవి ఎటువంటి వాతావరణంలో ఉన్నాయన్న దానిమీద వాటి జీవితకాలం ఆధారపడి ఉంటుంది.

మేడమ్! వీర్యకణాల జీవిత కాలమెంత? వీర్యం విడుదలైన తర్వాత బయటి వాతావరణంలో ఎప్పటి వరకు వీర్యకణాలు సజీవంగా ఉంటాయి?
వీర్య స్ఖలనం తర్వాత అవి ఎటువంటి వాతావరణంలో ఉన్నాయన్న దానిమీద వాటి జీవితకాలం ఆధారపడి ఉంటుంది. గది ఉష్ణోగ్రతలో 75 డిగ్రీల ఫారిన్ హిట్ లేదా 25 డిగ్రీల సెల్సియస్ వద్ద వీర్యంలో నీరున్నంత వరకు వీర్యకణాలు 4-6 గంటల వరకు జీవించి ఉంటాయి. వీర్యంలో 85 శాతం నీరు ఉంటుంది. నీరు పోతే గడ్డ కట్టడం మొదలవుతుంది. అదే సమయంలో వీర్యకణాలు కూడా నీటి శాతాన్ని కోల్పోతాయి. అందువల్ల గది ఉష్ణోగ్రత వద్ద పొడి వాతావరణంలో నీటి శాతాన్ని కోల్పోయే వీర్య కణం 1-3 గంటలు మాత్రమే మనుగడలో ఉంటాయి. స్థలించబడని వీర్య కణాలు పురుషుని దేహంలో 74 రోజులు జీవించి ఉంటాయి. అలాగే, స్త్రీ శరీరంలో గర్భాశయ ముఖద్వారం దగ్గర ఉన్న మ్యూకస్‌లో 3-5 రోజులు వీర్యకణాలు బతికి ఉండే అవకాశం ఉంటుంది. అంటే, అండం విడుదల కంటే ముందే వీర్యకణాలను స్త్రీ అండ వాహికలో ప్రవేశపెట్టే అవకాశం ఉండటం వల్ల ఫలదీకరణ శాతం పెరుగుతుంది. అయితే, సర్విక్స్ దగ్గర మ్యూకస్ లేదా జిగట పదార్ధం ఆరోగ్యంగా లేకపోతే మాత్రం వీర్యకణాలు జీవించే కాలం తగ్గిపోతుంది.
- డాక్టర్ భారతి, MS
మేరిటల్ కౌన్సెలర్
సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్






