నాకు ఐదవ నెల గర్భం.. సెక్స్ సమయంలో ఇద్దరికీ ఇబ్బందిగా ఉంది.. ఏం చేయాలి?

by Bhoopathi Nagaiah |

యోని పొడవు తగ్గినట్లు లేదా గర్భం బాగా కిందకు ఉన్నట్లుగా అన్పిస్తుంది.

నాకు ఐదవ నెల గర్భం.. సెక్స్ సమయంలో ఇద్దరికీ ఇబ్బందిగా ఉంది.. ఏం చేయాలి?
X

మేడమ్! నాకు ఐదవ నెల గర్భం. సెక్స్ సమయంలో ఇద్దరికీ ఇబ్బందిగా ఉంది. యోని పొడవు తగ్గినట్లు లేదా గర్భం బాగా కిందకు ఉన్నట్లుగా అన్పిస్తుంది. స్రావాలు ఎక్కువగా విడుదలవుతున్నాయి. అయినా, యోని నాళం బాగా టైట్‌గా అనిపిస్తోంది. ఇది సహజమేనా?

ర్భం దాల్చిన మొదటి 6-12 వారాలలో, చివరి తొమ్మిదో నెలలో సెక్స్‌లో పాల్గొనవద్దు. 4వ నెల నుంచి 7వ నెల చివరివారం వరకు ఏ రకమైన గర్భానికి సంబంధించిన అనారోగ్యాలు లేకపోతే సెక్స్‌లో పాల్గొనవచ్చు. 6వ నెలలో గర్భాశయ ముఖద్వారం (లేదా చివరి భాగం సర్విక్స్ అంటారు) కొద్దిగా కిందికి వస్తుంది. అందువల్ల యోని నాళం పొడవు కొద్దిగా తగ్గినట్లుగా అనిపిస్తుంది. కాన్పు అయిన తర్వాత తర్వాత అధికంగా స్రవిస్తాయి. ఇదంతా కూడా గర్భస్థ సమయంలో సహజమే. అయితే, గర్భం పెరిగే కొద్దీ మెన్ టాప్ పొజీషన్ వల్ల భార్య గర్భంపై బరువు పడటం అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి, ఇద్దరికి సైడ్ వే పద్ధతి మంచిది.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Next Story