మీ ఆయన కండోమ్ వాడోచ్చు కదా.. నువ్వెందుకు అవి వాడాలి?

by Bhoopathi Nagaiah |

నాకు పెళ్లయి మూడు సంవత్సరాలు. క్రమక్రమంగా నాకు సెక్స్ అంటే విముఖత, అయిష్టత కలుగుతున్నాయి

మీ ఆయన కండోమ్ వాడోచ్చు కదా.. నువ్వెందుకు అవి వాడాలి?
X

నాకు పెళ్లయి మూడు సంవత్సరాలు. ఈ కాలమంతా పిల్లల కాకుండా పిల్స్ వాడాను. క్రమక్రమంగా నాకు సెక్స్ అంటే విముఖత, అయిష్టత కలుగుతున్నాయి. నేను వాడే పిల్స్‌కి కోరిక తగ్గడానికి సంబంధం ఉందా? చెప్పగలరు?

వి ఇథినైల్ ఈస్ట్రాడియోల్, లివోనార్ జెస్ట్రాల్. ఈ రెండూ కలిసైనా, విడివిడి నువ్వు వాడుతున్న కుటుంబ నియంత్రణ మాత్రలో రెండు మందులున్నాయి. తప్పకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అయితే, సెక్స్‌లో ఆసక్తి తగ్గడానికి ఉండే ఇతర కారణాలనూ వెతకాలి. సెక్స్‌లో మూసధోరణి, బోర్ కొట్టడం. సెక్స్‌లో మీ భర్త మీ ఆనందం గురించి పట్టించుకోకపోవడం, మీ భర్తకి అంగస్తంభన లోపం లేదా శీఘ్రస్థలనం సమస్యలుండటం వంటివి. అయితే, మీరు వాడే మందులు ఖచ్చితంగా కోరిక లేదా లిబిడోను తగ్గిస్తాయి. ఈ పిల్స్ వల్ల కోరిక తగ్గడం.. మూడ్ త్వరత్వరగా మారుతుండటం కూడా కోరికను తగ్గిస్తుంది. అయితే పరిష్కారంగా మీరు ఈ మందులు ఇంత దీర్ఘకాలం వాడకూడదు. మానెయ్యాలి. మీ భర్త కండోమ్ వాడవచ్చు. ఎలాగూ మూడు సంవత్సరాలు పిల్స్ కొన్ని ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి, వాడకపోవడమే మంచిది. పైగా కుటుంబ నియంత్రణ బాధ్యతను భర్తలు కూడా తీస్కోవాలి. సంవత్సరాల తరబడి ఐయూడీ ఓసి పిల్స్ లాంటి ప్రమాదకర హార్మోన్స్‌తో పాటు ట్యూబెక్టమీని స్త్రీలే ఎందుకు చేయించుకోవాలి? మీ వారు కండోమ్ వాడవచ్చు. ప్లాన్ ప్రకారం పిల్లల్ని కనేశాక తనే వెసెస్టమీ చేయించుకోవచ్చు ఆలోచించండి.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Next Story