- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Russia: రష్యా భారత్ కు ఎందుకు చిరకాల మిత్రుడిగా మిగిలిపోయింది...భారత్ తీసుకునే ప్రతీ నిర్ణయానికి పుతిన్ మద్దతు ఎందుకు..
Russia: భారత్ పాకిస్తాన్ మధ్య సాగుతున్న ఉద్రిక్తతల్లో రోజురోజుకీ ఒక కొత్త పరిణామం చోటు చేసుకుంటుంది.

దిశ, వెబ్ డెస్క్: Russia: భారత్ పాకిస్తాన్ మధ్య సాగుతున్న ఉద్రిక్తతల్లో రోజురోజుకీ ఒక కొత్త పరిణామం చోటు చేసుకుంటుంది. ఇప్పటికే పాకిస్తాన్ కు మద్దతుగా చైనా పూర్తిగా అండగా నిలిస్తే, భారతదేశానికి మద్దతుగా రష్యా బేషరతుగా తన మద్దతును ప్రకటించింది. భారతదేశంలో తీసుకునే అన్ని నిర్ణయాలను మద్దతు ఇస్తున్నట్లు పేర్కొంది. అయితే అమెరికా మాత్రం తటస్థ వైఖరి తీసుకొని గోడమీద పిల్లి వ్యవహారం చేస్తోందని విమర్శకులు అంటున్నారు.
నేడు కాశ్మీర్ ను ఉద్దేశించి డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాబోయే 1000 సంవత్సరాల్లో కాశ్మీర్ సమస్య నుంచి పరిష్కారం లభిస్తుందని వెటకారంగా అన్న మాటలు, భారత విదేశాంగ వర్గాలను అసంతృప్తికి గురిచేస్తున్నాయి. మరోవైపు ఇంటర్నేషనల్ మానిటర్ రిఫండ్ పాకిస్తాన్ కు భారత్ వద్దని వారిస్తున్న పెద్ద మొత్తంలో రుణాన్ని అందించింది. దీనిపై కూడా భారత్ అసహనం వ్యక్తం చేసింది. అయితే నిజానికి రష్యా భారతదేశానికి ఎందుకు బేషరతుగా మద్దతు తెలిపింది.
పుతిన్ ఎందుకు భారత్ విషయంలో స్పష్టంగా మద్దతు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. భారత్ అలాగే రష్యా గడచిన ఏడు దశాబ్దాలుగా స్నేహితులుగా ఉన్నాయి. గతంలో సోవియట్ రష్యా ఉన్నప్పుడు భారత్ చిరకాల మిత్రుడిగా ఉంది. భారతదేశంలో స్థాపించిన అనేక ప్రభుత్వ యాజమాన్యం సంస్థల ఏర్పాటుకు రష్యా ఆర్థికంగాను టెక్నాలజీ పరంగాను ఎంతో సహకారం అందించింది. భారతదేశపు అంతరిక్ష పరిశోధనకు కూడా రష్యా ఎంతో సహాయం చేసింది. ముఖ్యంగా టెక్నాలజీ విషయంలో రష్యా భారత్ కు అన్ని విధాలుగా సహకరించింది.
దేశంలోని ప్రముఖ ఉక్కు కర్మాగారాలు బిలాయి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కూడా రష్యా ఎంతో సహకరించింది. పుతిన్ నేతృత్వంలోని రష్యా కూడా భారత్ పట్ల మిత్ర భావంతోనే ఉంది. గతంలో మిగ్ విమానాలు, అలాగే సుఖోయ్ - 30 విమానాలను భారత్ కు అందించడంలో రష్యా సహకరించింది. అలాగే ప్రస్తుతం రష్యా తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ S-400 మూలంగా పాకిస్తాన్ నుంచి వస్తున్న దాడులను భారత్ ఎంతో సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ముఖ్యంగా ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో భారత్, రష్యా మధ్య దృఢమైన బంధం ఏర్పడింది. దీనికి తోడు అమెరికా విషయంలో భారత్ తటస్థ వైఖరి వ్యవహరించడం కూడా రష్యాతో మిత్రత్వం కొనసాగించడానికి ఉపయోగపడింది.






