Anushka Sharma:‘తండ్రి యుద్ధ రంగంలో ఉన్నప్పుటి రోజుల్ని గర్తు చేసుకున్న అనుష్క శర్మ.. ఆ సమయంలో తల్లి

by Kodari Anjali |

అనుష్క శర్మ బాలీవుడ్‌లోని ప్రకాశవంతమైన తారలలో ఒకరు.

Anushka Sharma:‘తండ్రి యుద్ధ రంగంలో ఉన్నప్పుటి రోజుల్ని గర్తు చేసుకున్న అనుష్క శర్మ.. ఆ సమయంలో తల్లి
X

దిశ, వెబ్‌డెస్క్: అనుష్క శర్మ బాలీవుడ్‌లోని ప్రకాశవంతమైన తారలలో ఒకరు. ఈ నటి అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ బ్యూటీకి కోట్లలో అభిమానులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక సినిమాల్లో నటించే క్రమంలోనే అనుష్క శర్మ.. ప్రముఖ భారత క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీతో ప్రేమలో పడింది.

వీరిద్దరు అంగరంగ వైభవంగా వివాహం చేసుకుని.. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.పెళ్లి అనంతరం అనుష్క సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. భర్తకు మద్దతుగా నిలుస్తూ.. పిల్లల బాగోగులు చూసుకుంటోంది. ఇకపోతే ఈమె యుద్ధ సమయంలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

అయితే అనుష్క శర్మ కల్నల్ (రిటైర్డ్) అజయ్ కుమార్ కుమార్తె అన్న విషయం తెలిసిందే. ఒకసారి కార్గిల్ యుద్ధం సమయంలో తాను అనుభవించిన భయం గురించి పంచుకుంది. తన తండ్రి యుద్ధ రంగంలో ఉన్నప్పుడు ఆమె చిన్నతనంలో ఉన్నానని గుర్తుచేసుకుంది. కార్గిల్ కఠినమైనది. ఆ సమయంలో నేను చాలా చిన్నపిల్లనని, కానీ నా తల్లిని చూడటానికి నేను భయపడ్డానని వెల్లడించింది.

తన తల్లి ప్రమాద నివేదికలకు భయపడి వార్తా ఛానెల్‌లను ఎలా అంటిపెట్టుకుని ఉండేదో వివరించింది. ఆమె ఎల్లప్పుడూ వార్తలను చూస్తుండేదని.. ప్రాణనష్టం ప్రకటించినప్పుడల్లా కలత చెందేదని చెప్పింది. ఆమె తండ్రి ఆపరేషన్ బ్లూస్టార్‌తో సహా అనేక ఆపరేషన్లలో పనిచేశారని, యుద్ధం ద్వారా కుటుంబం ప్రయాణాన్ని చాలా వ్యక్తిగతంగా ఉంచారని తను చెప్పుకొచ్చింది.

ఇక ఇటీవల అనుష్క తన సోషల్ మీడియాలో భారత సాయుధ దళాలకు హృదయపూర్వక నివాళిని పంచుకుంది. ‘ఈ సమయాల్లో మనల్ని హీరోల వలె రక్షించినందుకు మన భారత సాయుధ దళాలకు ఎప్పటికీ కృతజ్ఞతలు. వారు వారి కుటుంబాలు చేసిన త్యాగాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని రాసుకొచ్చింది.

Next Story