- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండియా, పాక్ యుద్ధంపై UN సెక్రటరీ కీలక ప్రకటన
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. UN సెక్రటరీ జనరల్ డిప్యూటీ స్పోక్స్

దిశ, వెబ్ డెస్క్: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. UN సెక్రటరీ జనరల్ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ ఫర్హాక్ హక్ కీలక ప్రకటన చేశారు. ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య మరో సంఘర్షణను ఈ ప్రపంచం అస్సలు భరించబోదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు... అన్ని ప్రయత్నాలు చేస్తామని ఆయన ప్రకటన చేశారు.
భారత్ అలాగే పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలని మేము బలంగా కోరుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఆవేశపడి యుద్ధం చేయకూడదని సూచనలు చేశారు. అలా చేస్తే అనర్ధాలు తప్ప.. లాభమేమి ఉండదని.. స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగా గురువారం రోజున జమ్మూ కాశ్మీర్ పై దాడి చేసేందుకు పాకిస్తాన్ కుట్రలు పండింది. అయితే ఆ కుట్రలను ఇండియన్ ఆర్మీ... తన స్టైల్ లో తిప్పి కొట్టింది. ఈ దెబ్బకు పాకిస్తాన్ అతలాకుతలం అవుతోంది. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కూడా... ఇంట్లో నుంచి పారిపోయి ఓ బంకర్ లో దాక్కున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్కడి నుంచి.. నేరుగా విదేశాలకు వెళ్లే ఛాన్స్ కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది.






