- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్ దాడులపై ట్రంప్ కీలక ప్రకటన.. టిట్ ఫర్ టాట్ అంటూ
పాకిస్తాన్ పై ( Pakistan ) ఇండియా (India) విరుచుకుపడుతున్న నేపథ్యంలో... అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Tru

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ పై ( Pakistan ) ఇండియా (India) విరుచుకుపడుతున్న నేపథ్యంలో... అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల దాడి విషయంలో ఇండియాకు సంపూర్ణ మద్దతు ఇవ్వకుండా... తాజాగా తన మాట మార్చారు. తమకు ఇండియా అలాగే పాకిస్తాన్ ఇద్దరు మంచి మిత్రులేని అంటూ తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇద్దరూ మాకు కావాల్సిన వాళ్లే, కాబట్టి యుద్ధం మానుకోవాలని ఆయన కోరారు.
పాకిస్తాన్ పై జరిగిన చర్య చాలా భయంకరమైనదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. టిట్ ఫర్ టాట్ లాగా ఇండియా ( India ) వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. తనకు ఇరు పక్షాలతో మంచి సంబంధాలు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాబట్టి సమస్యను పరిష్కరించే మార్గంలో రెండు దేశాలు నడవాలని కోరారు. పాకిస్తాన్ అలాగే ఇండియా మధ్య సమస్యను తొలగించేందుకు నాకు చేతనైనంత సహాయం చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ట్రంప్. దీంతో ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇండియన్స్ చాలా ఘనంగా ఉన్నారు.






