- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor : జమ్మూ కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్
జమ్మూ కశ్మీర్(Jammu Kashmir)లో ముగ్గురు తీవ్రవాదులను అరెస్ట్ చేశారు పోలీసులు.

దిశ. వెబ్ డెస్క్ : జమ్మూ కశ్మీర్(Jammu Kashmir)లో ముగ్గురు తీవ్రవాదులను అరెస్ట్ చేశారు పోలీసులు. శుక్రవారం జమ్మూ కశ్మీర్‌లోని బడ్గామ్ జిల్లా మాగామ్ ప్రాంతంలో లష్కర్-ఎ-తోయిబా(LeT) ఉగ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాదులు ఉన్నట్టు సమాచారం అందుకున్న బడ్గామ్ పోలీసులు, CRPF, ఆర్మీ సంయుక్త ఆపరేషన్ చేపట్టి.. ముగ్గురు ముష్కరులను అరెస్ట్(Terrorists Arrested) చేశారు. అయితే వీరు తీవ్రవాదులా లేక వారికి సహాయం చేస్తున్నారా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అరెస్ట్ అయిన వారి నుంచి పిస్తోల్, గ్రెనేడ్‌లు, ఇతర మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
వీరిపై UAPA చట్టం కింద కేసు నమోదు చేసి.. ఉగ్రవాద కార్యకలాపాలపై విచారణ జరుపుతున్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో 26 మంది మరణించిన ఉగ్రదాడి తర్వాత భారత భద్రతా దళాలు ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)లో భాగంగా ఉగ్రవాదులపై దాడులు ముమ్మరం చేశారు. అలాగే జమ్మూ కశ్మీర్‌లో తనిఖీలు ముమ్మరం చేశారు. రాష్ట్రాన్ని అణువణువూ గాలిస్తూ.. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.






