Operation Sindoor: భారత్ సరైన రీతిలోనే స్పందించింది: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా

by S Gopi |

సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న ఉద్రిక్తత, జరుగుతున్న సైనిక చర్యలపై సమీక్షించారు.

Operation Sindoor: భారత్ సరైన రీతిలోనే స్పందించింది: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా
X

దిశ, నేషనల్ బ్యూరో: పెహల్‌గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైంది. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బుధవారం శ్రీనగర్‌లో అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితి గురించి చర్చించారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న ఉద్రిక్తత, జరుగుతున్న సైనిక చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడిన ఒమర్ అబ్దుల్లా.. పెహల్‌గామ్‌లో 26 మంది అమాయక పౌరులను అమానవీయంగా, అనాగరికంగా హత్య చేసిన తర్వాత, భారత్ తగిన పద్దతిలోనే స్పందించింది. భారత ప్రభుత్వం, రక్షణ దళాలు ప్రతీకారంగానైనా అన్ని విధాలుగా,ఖచ్చితమైన లక్ష్యాలతో, పౌరులకు ఏమీ కాకుండా దాడులను నిర్వహించాయి. ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే ధ్వంసం అయ్యాయి. అదే పాకిస్తాన్ దళాలు మాత్రం పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఒమర్ అబ్దుల్లా అన్నారు. ప్రజల విశ్వాసాన్ని కాపాడుకునేందుకు, సరిహద్దు గ్రామాల్లో జాగ్రత్తగా ఉండాలని అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి అధికారులు ప్రతిదానికీ సిద్ధంగా ఉండాలని, సరిహద్దు వెంబడి నివసించే వారి క్షేమం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది. ఇదే సమయంలో ప్రభావితమైన కుటుంబాలకు పునరావాసం, సహాయ చర్యల స్థితిని ముఖ్యమంత్రి సమీక్షించారు.

Next Story