Breaking: భారత సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత.. 8 మంది మృతి

by Vemula.Srinu Prasad |

భారత సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది...

Breaking: భారత సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత.. 8 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: భారత(Bharat) సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాకిస్థాన్(Pakistan) సైన్యం ఎల్వోసీ(LOC) వెంబడి స్థానిక గ్రామాల్లో కాల్పులు జరుపుతోంది. ఈ కాల్పుల్లో ఇప్పటివరకూ 8 మంది పౌరులు మృతి చెందారు. పాక్ కవ్వింపు చర్యలకు భారత్ కూడా దీటుగా సమాధానం ఇస్తోంది. దీంతో భారత్, పాకిస్థాన్ సైన్యం మధ్య భీకర పోరు జరుగుతుంది. పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో పలువురు భారత జవాన్లు గాయపడ్డారు. భారత జవాన్ల కాల్పుల్లో కొంతమంది పాక్ సైనికులు మృతి చెందారు. మరోవైపు ఎల్వోసీలో భారత్ ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది. ఇప్పటివరకూ 9 ఉగ్రవాద శివిరాలను ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్‌లోనూ భారీగా ఉగ్రవాదులు హతం అయినట్లు తెలుస్తోంది.

Next Story