- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: 27 ఎయిర్ పోర్టులు మూసివేత.. 430 విమానాలు రద్దు
దేశంలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ పోర్టుల మూసివేతతో పాటు విమానాలను కేంద్రం రద్దు చేసింది. ...

దిశ, వెబ్ డెస్క్: ఉత్తర, పశ్చిమ భారత్(India)లో మొత్తం 27 ఎయిర్ పోర్టులు(Airports) మూసివేశారు. 430 విమనాల(Flights)ను రద్దు చేశారు. ఈ ఆంక్షలు మే 10 ఉదయం 5 గంటల 29 వరకూ కొనసాగుతాయని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. పాక్ ఆక్రమిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్(Jammu Kashmir) నుంచి గుజరాత్(Gujarat) వరకూ పౌరులు విమాన ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించింది. పాకిస్థాన్ గగన తలం నుంచి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. మరోవైపు పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లోనూ హై అలర్ట్ ప్రకటించారు. ఈ మేరకు సరిహద్దు ప్రాంతాలు, ఎయిర్ పోర్టులు, విద్యాసంస్థలు మూసివేశారు. దీంతో విద్యాసంస్థల నుంచి అక్కడి పౌరులు విద్యార్థులను ఇళ్లకు తీసుకుపోతున్నారు.
అటు ఆపరేషన్ సింధూర్() భారత సరిహద్దులో కొనసాగుతోంది. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఉగ్రవాదుల స్థావరాలపై యుద్ధం ప్రకటించింది. క్షిపణులు, బాంబు దాడులతో ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసోంది. ఈ దాడుల్లో పలువురు ఉగ్రవాదుల హతం అయ్యారు. దీంతో పాకిస్థాన్ సైన్యం భారత సరిహద్దు గ్రామాలపై బాంబు దాడులకు పాల్పడుతోంది. ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేస్తుంటే.. పాకిస్థాన్ మాత్రం ఎల్‌వోసీ వెంబడి అమాయక ప్రజలపై మోర్టార్ బాంబు దాడులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో పలు ప్రాంతాల్లో భారత ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. పోలీసులకు సెలవులు రద్దు చేసింది. బహిరంగ సమావేశాలపైనా ఆంక్షలు విధించింది. పాకిస్థాన్ వైపు నుంచే విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చింది.






