- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor : భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు.. చైనా పర్యటనకు పాక్ ఉప ప్రధాని
భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు(Bharat-Pak Conflicts) నెలకొన్న వేళ.. పాక్ ఉప ప్రధాని చైనా(China) పర్యటనకు సమాయత్తమవడం తీవ్ర చర్చకు దారి తీసింది.

దిశ, వెబ్ డెస్క్ : భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు(Bharat-Pak Conflicts) నెలకొన్న వేళ.. పాక్ ఉప ప్రధాని చైనా(China) పర్యటనకు సమాయత్తమవడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈనెల 20 నుంచి 22 వరకు పాకిస్థాన్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషాక్ దార్(Muhammad Ishaq Dar) చైనా రాజధాని బీజింగ్(Beejing)కు మూడు రోజుల అధికారిక పర్యటనకు వెళ్లనున్నారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ(Wang Yi) ఆహ్వానంతో ఈ పర్యటన చేపట్టనున్నట్టు సమాచారం. ఈ పర్యటనలో దార్ వాంగ్ యీతో కలిసి దక్షిణాసియాలో నెలకొన్న ఇటీవలి పరిస్థితులు, భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు, సీజ్ఫైర్(Ceasefire) తర్వాత పరిస్థితులు, ప్రాంతీయ శాంతిపై చర్చిస్తారు. అలాగే చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్(CPEC) ప్రాజెక్టుల విస్తరణ, ఆర్థిక, వాణిజ్య సహకారం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై మాట్లాడనున్నారు.
ఈ సందర్భంగా దార్ చైనా ఉన్నతాధికారులు, వ్యాపారులను కలవనున్నారు. మొత్తానికి ఈ పర్యటన పాకిస్థాన్-చైనా మధ్య బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడం, ఆర్థిక సంబంధాలను మెరుగుపరచడం, దక్షిణాసియాలో శాంతి కోసం కలిసి పనిచేయడంగా చెప్పబడుతున్నప్పటికీ.. ఇటీవల జరిగిన భారత్-పాక్ యుద్ధంలో చైనా పాక్ మద్ధతు ఇవ్వడం, ఇపుడు పాక్ ఉప ప్రధాని చైనాలో పర్యటించడం భారత్ కు మింగుడు పడని అంశంగా మారింది. దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.






