తమను కాపాడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు తెలుగు విద్యార్థుల లేఖ

by Malleboina Mahesh |

జమ్మూ, కశ్మీర్ ప్రాంతంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చిక్కుకొని పోయినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం తమను కాపాడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు తెలుగు విద్యార్థుల లేఖ రాశారు.

తమను కాపాడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు తెలుగు విద్యార్థుల లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: కశ్మీర్ లో ఉగ్రవాదులు టూరిస్టులపై దాడి అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ప్రయోగించింది. ఈ దాడి మొత్తం 9 ప్రాంతాల్లోని ఉగ్రవాదుల శిబిరాలపై జరపగా 100 మందికి పైగా మృతి చెందారు. కాగా భారత్ చేసిన ఈ దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ ప్రత్యక్ష దాడులకు పాల్పడుతుంది. భారత పౌరులు, ఆస్తులు, ఆర్మీని టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడుతుంది. దీంతో భారత్ పాక్ దాడులను తిప్పికొడుతూ.. పాకిస్తాన్ పై విరుచుకుపడుతుంది. దీంతో గత రెండు రోజులుగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో జమ్మూ, కశ్మీర్ ప్రాంతంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు (Students of Telugu States) చిక్కుకొని పోయినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం తమను కాపాడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ (Union Minister Bandi Sanjay)కు తెలుగు విద్యార్థుల లేఖ రాశారు.

కశ్మీర్ నుంచి సురక్షిత ప్రాంతాలకు తమను తరలించాలని విద్యార్థులు కేంద్రమంత్రికి విజ్ఙప్తి చేశారు. దీంతో వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌ యూనివర్సిటీ అధికారులు, స్థానిక కలెక్టర్‌తో మాట్లాడారు. కాగా కేంద్ర మంత్రి ఆదేశాలతో తెలంగాణకు చెందిన 23 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా యుద్ధ పరిస్థితుల నేపథ్యంతో ఢిల్లీ తెలంగాణ భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ చేశారు. సరిహద్దుల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరులకు సహాయం కోసం ఏర్పాటు చేయగా.. ఇప్పటివరకు 30 ఎమర్జెన్సీకాల్స్‌ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. అలాగే ఈ కంట్రోల్ రూమ్ ద్వారా 8 మందిని సురక్షితంగా కాపాడినట్టు వివరించారు.

Next Story