- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విక్రమ్ మిస్రీపై నెట్టింట ట్రోలింగ్.. అసదుద్దీన్ ఒవైసీ సెన్సేషనల్ కామెంట్స్
దాయాది పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri)పై నెట్టింట్లో ట్రోలింగ్‌పై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తీవ్ర స్థాయిలో స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: దాయాది పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri)పై నెట్టింట్లో ట్రోలింగ్‌పై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తీవ్ర స్థాయిలో స్పందించారు. అత్యంత క్లిష్ట సమమంలో ప్రభుత్వ ప్రతినిధిగా మిస్రీ వ్యవహరించిన తీరు అద్భుతమని కొనియాడారు. కానీ, విక్రమ్ మిస్రీని ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్‌గా చేసుకుని కొంతమంది సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పందించార. ‘విక్రమ్ మిస్రీ నిబద్ధత, నిజాయితీతో కూడిన, దేశం కోసం కష్టపడే అధికారి. ప్రభుత్వ ఉద్యోగులు కార్యనిర్వాహక వర్గం ఆదేశాలకు అనుగుణంగా విధులు నిర్వర్తిస్తారు. వారు వెల్లడించే వివరాల్లో తమ సొంత నిర్ణయాల కంటే, ప్రభుత్వ విధానాలను ప్రతిబింబిస్తాయి. కాబట్టి వారిపై విమర్శలు చేయడం తగదు’ అంటూ అసదుద్దీన్ ట్వీట్ చేశారు.






