భారత్ - పాక్ యుద్ధం ఎఫెక్ట్: పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |

భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య ఉద్రిక్తతల వేళ పంజాబ్ ప్రభుత్వం(Punjab Government) కీలక నిర్ణయం తీసుకుంది.

భారత్  - పాక్ యుద్ధం ఎఫెక్ట్: పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య ఉద్రిక్తతల వేళ పంజాబ్ ప్రభుత్వం(Punjab Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని బాణసంచా దుకాణాలు మూసి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేగాకుండా.. ఎవరూ నిత్యావసరాలను బ్లాక్ చేయొద్దని ఆదేశించింది. ప్రస్తుత స్టాక్ వివరాలను మూడు రోజుల్లో వెల్లడించాలని సూచించింది. మరోవైపు ఉగ్రవాదులను అంతం చేయడమే లక్ష్యంగా భారత సైన్యం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ కొనసాగుతోంది. గురువారం సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్‌లపై దాడికి ప్రయత్నించింది. దీంతో గురువారం రాత్రి నుంచి పాకిస్తాన్‌ టార్గెట్‌గా భారత సైన్యం వరుస ఎటాక్‌లు చేస్తోంది.

Next Story