విమాన ప్రయాణికులకు అలర్ట్..ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మరో ప్రకటన

by Ajay Maddhiboyina |

ఇండియా పాకిస్థాన్ మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ పరిస్థితులను బట్టి తమ కస్టమర్లను అలర్ట్ చేస్తోంది.

విమాన ప్రయాణికులకు అలర్ట్..ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మరో ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా పాకిస్థాన్ మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ పరిస్థితులను బట్టి తమ కస్టమర్లను అలర్ట్ చేస్తోంది. తాజాగా తమ ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్ పలు సూచనలు చేసింది. ఢిల్లీ విమానాశ్రయ కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతాయని ప్రకటించింది. మారుతున్న వైమానిక పరిస్థితులు మరియు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ నిర్దేశించిన మెరుగైన భద్రతా చర్యల కారణంగా కొన్ని విమానాల సమయం మారవచ్చని తెలిపింది.

చెకింగ్ సమయం పెరగవచ్చని స్పష్టం చేసింది. కాబట్టి ప్రయానికులు విమానయాన సంస్థల నుండి ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించింది. చెక్ ఇన్ లగేజ్ నిబంధనలను అనుసరించాలని సూచించింది. భద్రతా తనిఖీ కేంద్రాల వద్ద ఎక్కవ సమయం పడుతుంది కాబట్టి కాస్త ముందుగానే విమానాశ్రయానికి రావాలి అని ఆదేశించింది. ఢిల్లీ విమానాశ్రయ అధికారిక వెబ్ సైట్ ద్వారానే ఎక్కడ ఉందో తెలుసుకోవాలని సూచించింది.

Next Story