చైనాకు పాకిస్థాన్ ప్రధాని స్పెషల్ థాంక్స్

by Ajay Maddhiboyina |

ఇండియా పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్థాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకారం చెప్పాయి.

చైనాకు పాకిస్థాన్ ప్రధాని స్పెషల్ థాంక్స్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇండియా పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్థాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకారం చెప్పాయి. దీనిపై అధికారిక ప్రకటన కూడా వెెలుబడింది. అయితే కాల్పల విరమణ అనంతరం పాకిస్థాన్ ప్రధాని ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. యుద్దం తామే గెలిచామని ఆయన ప్రకటించుకున్నారు. అందరి ప్రయోజనాల కోసమే కాల్పుల విరమణ అని అన్నారు. సీజ్ ఫైర్ విషయంలో తమకు సహకరించిన అమెరికా,టర్కీ, చైనా దేశాలకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

అంతే కాకుండా పాకిస్థాన్ కు స్పెషల్ థాంక్స్ చెప్పారు. ఇదిలా ఉంటే చైనా పాకిస్థాన్‌కు మద్దతుగా నిలుస్తుందని మొదటి నుండి పలువురు విశ్లేషించారు. కానీ చైనా మాత్రం తాము ఎవ్వరికీ మద్దతు ఇవ్వమని చెబుతూ వచ్చింది. కానీ ఓ ఇంటర్వ్యూలో చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ తాము పాకిస్థాన్ వైపే నిలబడతామని స్పష్టం చేశారు. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లోనూ పాక్ సంయమనంతో ఉందని బాధ్యతాయుతంగా వ్యవహరించిందని చెప్పారు. పాకిస్థాన్ కు అన్ని వేళలా తాము అండగా ఉంటామని వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటామని చెప్పారు. దీంతో పాక్ చైనా మధ్య మైత్రి గురించి ప్రపంచానికి తెలిసిపోయింది.

Next Story