Pakistan: పుల్వామా దాడితో మా అద్భుత ప్రతిభ చూపించాం.. పాక్ సంచలన వ్యాఖ్యలు

by Shamantha N |

పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ తో తర్వాత భారత్- పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్నాయి. కశ్మీర్‌లోని పుల్వామా దాడి వెనుక తమ హస్తం ఉందని పాక్ అంగీకరించింది.

Pakistan: పుల్వామా దాడితో మా అద్భుత ప్రతిభ చూపించాం.. పాక్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ తో తర్వాత భారత్- పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్నాయి. కశ్మీర్‌లోని పుల్వామా దాడి వెనుక తమ హస్తం ఉందని పాక్ అంగీకరించింది. ఈ విషయాన్ని పాక్ వాయుసేన ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ ప్రెస్ మీట్ లో అంగీకరించారు. ఇటీవల ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో డీజీఐఎస్‌పీఆర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ చౌదురి, నేవీ ప్రతినిధితో కలిసి ఔరంగజేబ్‌ అహ్మద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఔరంగజేబ్ మాట్లాడుతూ ‘‘పాక్‌ భుమి, జల, గగన సరిహద్దులకు లేదా ప్రజలకు ముప్పుగా పరిణమిస్తే.. వాటిని ఎదుర్కొనేందుకు మేం రాజీ పడబోం. దాన్ని పట్టించుకోకుండా ఉండలేం.. మా దేశానికి కట్టుబడి ఉంటాం. మా దేశ ప్రజల కీర్తి మొత్తం దళాల్లోనే ఇమిడి ఉంది. మేం ఎప్పుడూ దాన్ని నిలబెట్టుకుంటాం. పుల్వామాలో మా అద్భుతమైన ప్రతిభను చూపించాం. మా ఎత్తుగడలు ఏంటో నిరూపించుకున్నాం. కార్యదక్షత.. వ్యూహాత్మక చతురతను ఇప్పటికే ప్రదర్శించాం’’ అని వ్యాఖ్యానించారు.

ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్..

అయితే, ఔరంగజేబ్‌ వ్యాఖ్యలతో పాక్‌ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందన్న విషయం అర్థమైంది. పుల్వామా దాడితో తమకు సంబంధం లేదని పాకిస్థాన్‌ ఎంత బుకాయించినా.. ఇప్పుడు వాయుసేనాధికారి వ్యాఖ్యలతో వాస్తవం బయటకు వచ్చింది. 2019లో పుల్వామాలో జరిగిన బాంబుదాడిలో 40 మంది పారామిలిటరీ సిబ్బంది మరణించారు. అయితే, అప్పట్లో దానికి కారణం తాము కామని పాక్ బుకాయించినా.. ఇప్పుడు ఆ దేశ వాయుసేన ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ ఔరంగజేబ్‌ అహ్మద్‌ ఆ విషయాన్ని ప్రెస్‌మీట్‌లో అంగీకరించారు.

Next Story