- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత ప్రభుత్వ ఆదేశాలతో 8,000కి పైగా ఎక్స్ అకౌంట్ల బ్లాక్.. ఏవేవి అంటే?
భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ శంఖారావం మోగింది.

దిశ, వెబ్ డెస్క్: భారత్, పాకిస్థాన్ (ఇండియా-Pakistan) మధ్య యుద్ధ శంఖారావం మోగింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేపట్టిన మెరుపు దాడులతో బిక్కచచ్చిన పాకిస్థాన్.. తన ఉనికిని చాటుకొనేందుకు ప్రయత్నిస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో వరుస దాడులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో దేశ భద్రతా పరంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ భద్రతకు భంగం కలిగించే సమాచారాన్ని పంచుతున్నట్లు గుర్తించిన ఎక్స్ (X) ఖాతాలను బ్లాక్ చేయాల్సిందిగా సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాదాపు 8000కి పైగా ఎక్స్ ఖాతాలను సంస్థ బ్లాక్ చేసింది. భారత ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను అనుసరించి చట్టపరమైన విధంగా ఈ చర్యలు తీసుకున్నామని ఎక్స్ స్పష్టం చేసింది. అయితే, ఫ్రీ స్పీచ్ అంశంపై తమ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, స్థానిక చట్టాలను గౌరవించడం తమ బాధ్యతగా భావిస్తున్నట్టు తెలిపింది.






