- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్... మరికాసేపట్లో పాక్ ప్రధాని ప్రెస్ మీట్
భారత ఆర్మీ(Indian Army) 'ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor) పేరుతో పాకిస్తాన్, POKలోని 9 ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం అర్థరాత్రి దాడి చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : భారత ఆర్మీ(Indian Army) 'ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor) పేరుతో పాకిస్తాన్, POKలోని 9 ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం అర్థరాత్రి దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల అనంతరం భారత్-పాక్(Bharat-Pak Conflicts) మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఏప్రిల్ 22న పహల్గామ్లో 26 మంది భారత టూరిస్టులను హతమార్చిన ఉగ్రదాడికి రివెంజ్గా... ఆపరేషన్ సిందూర్ పేరుతో 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది ఇండియన్ ఆర్మీ. జైష్-ఎ-మహమ్మద్ లీడర్ మసూద్ అజహర్ కుటుంబంలో 14 మంది చనిపోగా.. 31 మంది సాధారణ పౌరులు మరణించారని, మసీదు లాంటి ప్రాంతాలు దెబ్బతిన్నాయని పాక్ ఆరోపించింది.
ఈ దాడుల నేపథ్యంలో పాక్ ప్రధాని షెహబాజ్(Pakistan Prime Minister Shahbaz) మరికొద్దిసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం ఆ దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. అయితే భారత్ పై యుద్ధాన్ని అధికారికంగా ప్రకటిస్తారేమోనని పాక్ జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది.






