- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
No more war: భారత్ -పాక్ కాల్పుల విరమణ ఒప్పందంపై నూతన పోప్ కీలక వ్యాఖ్యలు
భారత్ -పాక్ కాల్పుల విరమణ ఒప్పందంపై నూతన పోప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్-పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణపై నూతన పోప్ లియో-14 (రాబర్ట్ ప్రివోస్ట్) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల నూతన పోప్ గా ఎన్నికైన పోప్ లియో (Pope Leo XIV) ఇవాళ వాటికన్ లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లోని జనసమూహాన్ని ఉద్దేశించి తొలి ఆదివారం సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా భారత్ పాక్ కాల్పుల విరమణనను తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇక యుద్ధం వద్దు (no more war) అని ప్రపంచంలోని ప్రధాన శక్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు. చర్చలు శాశ్వత శాంతికి దారి తీస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో శాశ్వత శాంతిని నెలకొల్పాల్పడంతో పాటు గాజాలో కాల్పుల విరమణను ప్రకటించాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేయాలన్నారు.
కొత్త పోప్ కు తమిళనాడుతో అనుబంధం:
ఇటీవల పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూతతో నూతన పోప్గా అమెరికాకు చెందిన రాబర్ట్ ప్రివోస్ట్ ను 133 మంది కార్డినల్స్ ఎన్నుకున్న సంగతి తెలిసిందే. పోప్ గా ఓ అమెరికన్ ఎన్నిక కావడం చరిత్రలోనే ఇదే తొలిసారి. పోప్ గా ఎన్నికయ్యాక రాబర్డ్ ప్రవోస్ట్ పేరును లియో-14 గా నామకరం చేశారు. అయితే నూతన పోప్ కు భారతదేశంతోనూ అనుబంధం ఉంది. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా పొళ్లాచ్చి ప్రాంతంలోని అగస్టియన్ చర్చి నిర్వాహకులు నడుపుతున్న శన్బగం పాఠశాలను ఆయన 2006 లో సందర్శించారు. ఆ సమయంలో స్కూల్ క్యాంపస్ ముందు రియో-14 తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.






