జవాన్లపై పూల వర్షం.. వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే

by velandi.Saikiran |

ఇండియా ( India) వర్సెస్ పాకిస్తాన్ ( Pakisthan) మధ్య యుద్ధం జరుగుతోన్న నేపథ్యంలో... ఇండియన్ ఆర్మీ ( Indian Army) సభ్య

జవాన్లపై పూల వర్షం.. వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా ( India) వర్సెస్ పాకిస్తాన్ ( Pakisthan) మధ్య యుద్ధం జరుగుతోన్న నేపథ్యంలో... ఇండియన్ ఆర్మీ ( Indian Army) సభ్యుల సేవలపై దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. తమ ప్రాణాలు తెగించి ఇండియా కోసం పోరాడుతున్నారని... జనాలు కూడా వాళ్ల కోసం ప్రార్థనలు చేస్తున్నారు. యుద్ధం గెలిచి ఇండియాను కాపాడాలని పేర్కొంటున్నారు భారత ప్రజలు. ఇక ఎక్కడ ఇండియన్ జవాన్ కనిపించినా రెస్పెక్ట్ ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఉత్తరప్రదేశ్ ( Uttar Pradesh) రాష్ట్రంలో భారత జవాన్లు కనిపించారు. దీంతో స్థానికులు అందరూ అక్కడికి వచ్చి పూల వర్షం కురిపించారు. యుద్ధం నేపథ్యంలో.. బిజీగా ఉన్నా ఇండియన్ జవాన్లు ( Jawans)... ఇవాళ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ భోజనశాలకు వెళ్లారు. ఈ సందర్భంగా వాళ్లు భోజనం చేసి బయటకు వస్తున్న తరుణంలో... వాళ్లపై స్థానిక ప్రజలు పూల వర్షం కురిపించారు.

మీ సేవలకు సెల్యూట్ అంటూ చప్పట్లతో వాళ్లను గౌరవించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా.. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కాసేపటికి క్రితమే ముగిసింది. అగ్రరాజ్యం అమెరికా ( America) మధ్య వర్తిత్వము చేయడంతో.. రెండు దేశాలు శాంతించాయి. ఇవాళ సాయంత్రం ఐదు గంటల నుంచి రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.


Next Story