భారత్ - పాక్ మధ్య తారా స్థాయికి చేరిన యుద్ధం.. అర్ధాంతరంగా ఐపీఎల్ టోర్నమెంట్ రద్దు?

by Gantepaka Srikanth |

భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ(BCCI) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

భారత్ - పాక్ మధ్య తారా స్థాయికి చేరిన యుద్ధం.. అర్ధాంతరంగా ఐపీఎల్ టోర్నమెంట్ రద్దు?
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ(BCCI) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ -2025 సీజన్‌(Indian Premier League)ను రద్దు చేయాలనే ఆలోచనలో పడినట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. ఇప్పటికే ఇవాళ అరుణాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల మైదానం వేదికగా జరగాల్సిన ఢిల్లీ-పంజాబ్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌తో పాటు ఇతర దేశాల్లో జరుగుతున్న మ్యాచ్‌లను రద్దు చేశారు. ఈ విషయాన్ని BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రకటించారు. తక్షణమే ప్రేక్షకులంతా మైదానం వీడి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పాకిస్తాన్‌ మిస్సైళ్లతో ఎటాక్ చేసింది. జమ్మూకశ్మీర్‌, రాజస్థాన్, పంజాబ్ సహా అనేక ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతోంది. భారత సైన్యం(Indian Army) కూడా ధీటుగా బదులిస్తోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు భారత ఆర్మీకి సమాచారం అందించాయి. జమ్మూతో సహా పఠాన్‌కోట్‌, ఉధమ్‌పుర్‌లలో ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు సాంబా జిల్లాలో పాక్‌ రేంజర్లు కాల్పులకు తెగబడుతున్నట్లు సమాచారం. పలుచోట్ల భారీగా శబ్దాలు వినిపిస్తున్నాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పలుచోట్ల కరెంటు నిలిపివేశారు.

Next Story