- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ceasefire : కాల్పుల విరమణపై భారత ప్రజల్లో అసహనం!
గత 3 రోజులుగా జరిగిన భారత్ పాక్ యుద్ధానికి(India Pakistan War) శనివారం సాయంత్రం కాల్పుల విరమణ(Ceasefire) ఒప్పందంతో ఫుల్ స్టాప్ పెట్టిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : గత 3 రోజులుగా జరిగిన భారత్ పాక్ యుద్ధానికి(India Pakistan War) శనివారం సాయంత్రం కాల్పుల విరమణ(Ceasefire) ఒప్పందంతో ఫుల్ స్టాప్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే పహాల్గం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) అనంతరం భారత ప్రజల్లో మరోసారి పాకిస్తాన్ పై తీవ్ర ఆగ్రహం పెల్లుబికింది. ఆపరేషన్ సిందూర్(Opeation Sindoor) తో అది కొంత శాంతించినా.. ఇరు దేశాల మధ్య ఉన్న POK సమస్యపై, పాక్ ఉగ్రవాద సపోర్ట్ పై భారత్ ఇప్పుడే ఏదోకటి చేసి.. మళ్ళీ ఎన్నడూ ఉగ్రదాడులు జరగకుండా చూడాలని మెజారిటీ ప్రజలు కోరుకున్నారు. అయితే ఇరు దేశాల మధ్య 3 రోజుల భీకర యుద్ధం తర్వాత.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకున్నారు. సరిగ్గా ఇక్కడే మళ్ళీ దేశ ప్రజలు తీవ్ర అసహనానికి, అసంతృప్తికి గురవుతున్నారు.
పాకిస్తాన్‌తో గతంలోనూ ఎన్నో సార్లు కాల్పుల విరమణ ఒప్పందాలు జరిగాయి. కానీ అవి ఎంతో కాలం పని చేయలేదు. కొద్ది రోజులకే పాక్ మళ్లీ కాల్పులకు తెరలేపింది. సరిహద్దుల్లో గస్తీ కాసే భారత సైనికుల మీద కాల్పులు, గ్రెనేడ్ దాడులు, ఉగ్రవాదులకు మద్దతు ఇవన్నీ పాక్ తో మనకున్న గత అనుభవాలు కూడా. అటువంటి దేశం శాంతి ఒప్పందం చేసుకోవడాన్ని భారత ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు.
ప్రతీసారి మనం సంయమనం పాటించినా, పాకిస్తాన్ మాత్రం దాని ధోరణిని మార్చుకోలేదు. ఈ స్థితిలో కాల్పుల విరమణ మాటలకే పరిమితమై పోతుందా అన్న అనుమానం ప్రజల్లో ఉంది. మన దేశ భద్రతకు ప్రమాదం ఏర్పడే పరిస్థితుల్లో ప్రభుత్వాలే కాదు, ప్రజలు కూడా నిశ్శబ్దంగా ఉండలేరు. సైనికులను, వారి ప్రాణాలని అత్యంత విలువైనవిగా భావించే ప్రజలు "పాక్‌కి గట్టి బుద్ధి చెప్పాలి" అనే ఆవేశాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సామాన్య ప్రజలకు శాంతి కావాలి కానీ, అది వాస్తవంగా అమలులోకి రావాలని కోరుకుంటున్నారు. మాటల శాంతి కాకుండా, ఆచరణలో కనిపించే శాంతి కావాలని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రెండు దేశాలు చర్చలతో సమస్యలకు పరిష్కారం కనుగొనాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.






