- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > ఆపరేషన్ సిందూర్ > జమ్మూ టార్గెట్‌గా పాక్ మిస్సైళ్లతో దాడి.. నష్టంపై భారత ఆర్మీ అధికారిక ప్రకటన
జమ్మూ టార్గెట్‌గా పాక్ మిస్సైళ్లతో దాడి.. నష్టంపై భారత ఆర్మీ అధికారిక ప్రకటన
by Gantepaka Srikanth |
జమ్మూకశ్మీర్(Jammu and Kashmir) టార్గెట్‌గా గురువారం రాత్రి 8:30 గంటల సమయంలో పాకిస్తాన్(Pakistan) మిస్సైల్‌తో ఎటాక్ చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్(Jammu and Kashmir) టార్గెట్‌గా గురువారం రాత్రి 8:30 గంటల సమయంలో పాకిస్తాన్(Pakistan) మిస్సైల్‌తో ఎటాక్ చేసింది. జమ్మూ నగరంలోని ఎయిర్‌పోర్ట్ సహా ఏడు ప్రాంతాల్లో దాడులకు పాల్పడింది. ఒక్కసారిగా భారీ పేలుడు శబ్ధాలు విన్న కశ్మీర్ ప్రజలు భయంతో హడలెత్తారు. ఇళ్లలోకి పరుగులు తీశారు. పాక్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని ముందే గ్రహించిన భారత సైన్యం పాక్ దాడుల్ని తిప్పికొడుతోంది. అఖ్నూర్, కిష్త్వార్, సాంబా సెక్టార్‌లో అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. జమ్మూతో సహా పఠాన్‌కోట్, ఉధమ్‌పుర్‌లలో ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ, కుప్వారా సహా పలుచోట్ల కరెంటు నిలిపివేశారు.
Next Story






